Sunday, December 11, 2011

అర్థరాత్రి వరకు మేలుకోవడం మంచిది కాదు....tv5news


AA

* పరిశోధనల్లో వెల్లడైన వాస్తవాలు
* త్వరగా నిద్రపోతే బెటర్‌
* లేకుంటే ఊబకాయం వచ్చే ప్రమాదం


మీ పిల్లల్లో ఫిట్‌నెస్‌ లేదా ? చురుకుదనం లోపించిందా ? డోంట్‌ వర్రీ. చిన్న చిట్కా పాటిస్తే చాలు ఫిట్‌నెస్‌తోపాటు షార్ప్‌నెస్‌ కూడా పెరుగుతుంది. ఇంతకీ ఏంటా చిట్కా అంటారా ? లెట్స్‌ వాచ్‌ దిస్‌ స్టోరీ.

పిల్లల్ని నిద్రపుచ్చేందుకు తల్లులు నానా ఇబ్బందులు పడుతుంటారు. కొందరైతే ఫర్వాలేదు కానీ, మరికొందరైతే అర్థరాత్రి వరకూ మెలుకువగా ఉంటారు. దీంతో ఉదయాన్నే వాళ్లను లేపాలంటే గట్టి ప్రయత్నాలే చేయాలి. పిల్లలు ఇలా అర్థరాత్రి వరకు మేలుకోవడం మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు. త్వరగా పడుకొని, అంతే తొందరగా నిద్ర లేచే చిన్నారులు ఫిట్‌గా ఉంటారని తెలిపారు.

అంతేకాదు వాళ్లలో యాక్టివ్‌నెస్‌ ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. 2వేలకు పైగా పిల్లల నిద్రసమయాల్ని పరిశీలించిన సైంటిస్టులు ఎన్నో కొత్త విషయాలు గుర్తించారు. ఆలస్యంగా పడుకొని, బాగా పొద్దెక్కాక లేచే చిన్నారుల్లో ఊబకాయం సమస్య తలెత్తే ప్రమాదం ఉందని చెప్పారు. చూశారుగా ఇకనైనా మీ చిన్నారుల్ని త్వరగా నిద్రపుచ్చండి. వాళ్లు ఫిట్‌గా ఉండేందుకు మీవంతు ప్రయత్నం చేయండి.

0 comments:

Post a Comment