Saturday, December 10, 2011

‘మల్లెమాల’ ఎంఎస్‌రెడ్డి కన్నుమూత


AA


ప్రముఖ నిర్మాత, రచయిత ఎంఎస్‌రెడ్డి ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎంఎస్‌రెడ్డి మరణంతో తెలుగుచలన చిత్రసీమ ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఎంఎస్‌రెడ్డి 1924 ఆగస్టు 15 తేదిన నెల్లూరు జిల్లాలోని అలిమిలి లో జన్మించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఎంఎస్‌రెడ్డి బాధపడుతున్నారు.

మల్లెమాల పేరుతో కవితల్ని, సినీగేయాల్ని ఎంఎస్‌రెడ్డి రాశారు. అంకుశం చిత్రంలో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో నటించారు. ఆయన అసలు పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి. అయితే ఆయన మల్లెమాల, ఎంఎస్‌రెడ్డిగానే తెలుగువారికి సుపరిచితుడు.‘భార్య’ చిత్రంతో చలన చిత్రసీమలో ప్రవేశించిన ఎంఎస్‌రెడ్డి.. తలంబ్రాలు, అంకుశం, ఆహుతి, ఆగ్రహం, అమ్మోరు, అరుంధతి, బాల రామాయణం లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. జూనియర్ ఎన్టీయార్‌ను బాల రామాయణం చిత్రం ద్వారా తెలుగు చలన చిత్రసీమకు పరిచయం చేశారు.

ఎంఎస్‌రెడ్డి మృతికి చలనచిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు సంతాపం తెలిపారు. ఆత్మకథలో వివాదస్పద వ్యాఖ్యలుఇటివల ఆయన రాసిన ‘ఇది నా కథ’ ఆత్మకథ తెలుగు చిత్ర పరిశ్రమలో వివాదస్పదమైంది. తన ఆత్మకథలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని కొందరిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల్ని ఈ ఆత్మకథలో ఆయన తెలిపారు. 
 
source:TV5

0 comments:

Post a Comment